పల్లెల అభివృద్ధికే ప్రణాళికలు


Sun,September 8, 2019 11:52 PM

మనోహరాబాద్‌: 30 రోజుల ప్రణాళికలో భాగంగా మూడో రోజు అయిన ఆదివారం మనోహరాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం పై దృష్టి సారించారు. మండలంలోని మనోహరాబాద్‌లో రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌రెడ్డి, కాళ్లకల్‌లో ప్రత్యేకాధికారి నజీ బ్‌ అహ్మద్‌, రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్‌ ముదిరాజ్‌, కోనాయిపల్లి పీటీ, దండుపల్లి, పర్కిబండ, గౌతోజిగూడెం, రామాయిపల్లి తదితర గ్రామాల్లో చెత్తాచెదారం తొలిగింపు తదితర అంశాలపై దృష్టి సారించారు. వెంకటాపూర్‌ అగ్రహారంలో యువకులు చెత్తాచెదారాన్ని తొలిగించడంతో పాటు హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు.
శ్రమదానంలో పాల్గొన్న యువకులు, మహిళలు
తూప్రాన్‌ రూరల్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు తూప్రాన్‌ మండలంలోని పలు గ్రామాల్లో చురుకుగా సాగుతున్నాయి. ఆయా గ్రామాలకు కేటాయించిన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ముండ్లపొదలు, పిచ్చిమొక్కలను తొలిగించి పరిశుభ్రతకు చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, పంచాయతీ పాలకమండలి సభ్యులు, మహిళలు, యువజన సంఘాల భాగస్వామ్యంతో పరిశుభ్రతకు చొరవ చూపించారు. ఆదివారం వట్టూర్‌, గుండ్రెడ్డిపల్లి, యావాపూర్‌, దాతర్‌పల్లి, కిష్టాపూర్‌, పలు గ్రామాల్లో శ్రమధాన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పరిసరాలు, రోడ్లకు ఇరువైపుల, ఇంటి పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, ముండ్లపొదలను తొలిగించారు. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకాధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
నిజాంపేట: మొక్కలు నాటి సంరక్షించినప్పుడే అవి వృక్షాలుగా మారి భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడుతాయన్ని నిజాంపేట సర్పంచ్‌ అనూష అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం 30రోజుల కార్యాచరణలో భాగంగా నిజాంపేటలో ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ నుంచి ఆర్యవైశ్యభవన్‌ వరకు సుమారు కిలో మీటర్‌ మేర సీసీ రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలపై సర్పంచ్‌ అనూష, ఎంపీటీసీ లహరి, కో ఆప్షన్‌ సభ్యులు, స్టాండింగ్‌ కమిటీలు 1,2వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కొమ్మాట బాబు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తిరుమల్‌, కారోబార్‌ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...