గంగాయపల్లిని అన్ని విధాలుగా..


Sun,September 8, 2019 11:52 PM

-అభివృద్ధి చేస్తా
నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ :ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతితోనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం శివ్వంపేట మండలంలోని గంగాయపల్లి, ఏదుల్లాపూర్‌, గూడూర్‌ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌ పర్సన్‌ గంగాయపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు గ్రామస్తుల సమక్షంలో ప్రకటించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెడ్పీ చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఇందుకు గ్రామస్తులు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాగా సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా 30రోజుల ప్రణాళికలో భాగంగా పల్లెప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలతోనే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి బాటలో పయనించేలా కృషి చేయాలని సూచించారు. హరితహారం కింద ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. గ్రామంలో పాడుబడ్డ బావులను గుర్తించి తొలిగించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు ఇండ్లు కావాలని జెడ్పీ చైర్‌ పర్సన్‌ను కోరారు. అనంతరం ఏదుల్లాపూర్‌ గ్రామంలో స్థానిక సర్పంచ్‌ కీర్తన తో కలిసి రోడ్లును ఊడ్చి శ్రమదానం చేశారు. గ్రామ పరిశుభ్రంగా ఉండటానికి ఉపాధిహామీ పథకం కింద గ్రామ వ్యవసాయ పొలాల్లో నిర్మిస్తున్న 82 బర్రెల షెడ్లకు భూమిపూజ చేశారు. అనంతరం గూడూర్‌ గ్రామంలో హరితహారం కింద మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, ఎంపీడీవో నవీన్‌, ఏపీవో అనీల్‌, సర్పంచులు శ్యామల, స్వరాజ్యలక్ష్మి, ఎంపీటీసీ గోవింద్‌తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...