గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి


Sun,September 8, 2019 11:52 PM

తూప్రాన్‌ రూరల్‌ : గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా శ్రమిస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశయాలు, తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. మన ఊరు, మన ఇండ్లు, మన రాష్ట్రం అనే నినాదంతో ముందుకు సాగితేనే మారుమూల పల్లెలు అభిృద్ధిని సాధించగలుగుతాయన్నారు. వెంకటాయపల్లిలో ఆదివారం హరితహారం మొక్కలు నాటిన అనంతరం ఆయన పర్యటించారు. గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ మురుగు కాల్వలు, రోడ్లు, చెత్తాచెదారం వేసే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామస్తుల భాగస్వామ్యంతో పని చేస్తేనే, గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ 30 రోజుల ప్రణాళిక రూపొందించి, ప్రతి రోజు ఆయా గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి సీఎం కేసీఆర్‌ ఆశయాలను నెరవేర్చాలన్నారు. గ్రామాల్లో హరితహారం, పచ్చదనం పరిశుభ్రత, ఇంకుడుగుంతల నిర్మాణాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. పురాతన బావులు, చెత్తాచెదారంతో వ్యాధులు సక్రమించకుండా అధికారుల సహకారంతో ప్రజలు కృషి చేయాలన్నారు. ఎవరికి వారే తమతమ గ్రామాలను ఆదర్శంగా చేసుకోవల్సిన బాధ్యత ఆయా గ్రామాలకు చెందిన ప్రజలదేనన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి మాధవి, వీఆర్వో హరీశ్‌, సర్పంచ్‌ లంబ వెంకటమ్మ, ఉప సర్పంచ్‌ హరీశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గోలివెంకట్‌రెడ్డి, వట్టూర్‌ సర్పంచ్‌ పాంబండ జనమ్మ, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...