ఉపాధ్యాయ వృత్తి మహనీయమైనది


Sun,September 8, 2019 12:01 AM

-వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేసేది గురువులే...
-గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలి..
-విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి...
-జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్

మనోహరాబాద్ : అన్ని రంగాల్లోకెళ్లా ఉపాధ్యాయ వృత్తి మహనీయమైనదని, మనల్ని మంచి మార్గం వైపు నడుపుతూ ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేసేది గురువులేనని జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జెడ్పీ చైర్ పర్సన్ జ్యోతి ప్రజ్వాళన చేసి ప్రసంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువులను ఎల్లప్పుడూ గౌరవిస్తూ వారు చెప్పే విద్యాబోధనలను అర్థం చేసుకున్నప్పుడే విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేధిస్తారన్నారు.

తమ విద్యాబోధనతో అజ్ఞానుడిని సైతం మహనీయుడిగా మార్చగల శక్తి కేవలం గురువులకే ఉంటుందని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకుని గురువుల దిశానిర్ధేశంతో లక్ష్యం వైపు పయనించాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ వచ్చిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలను తలదన్నె విధంగా నేడు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు మారాయన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే నేడు మెరుగైన విద్య లభిస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులకు ఎదురైయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి, ఎంఈవో నర్సింహులు, ఎంపీపీ పురం నవనీతారవి ముదిరాజ్, ప్రధానోపాధ్యాయులు వెంకటస్వామి, నర్సింగరావు, ఉపాధ్యాయులు సంజీవయ్య, బ్రహ్మచారి, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఉన్నతికి కృషి చేయాలి ఎమ్మెల్యే క్రాంతికిరణ్
అల్లాదుర్గం: ఉపాధ్యాయులు విద్యార్థుల ఉన్నతికి కృషి చేయాలని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు.ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శనివారం జోగిపేటలో అల్లాదుర్గం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లి, తండ్రి,గురువు అన్ని తామే అయి విద్యార్థులకు బోధించేవారే ఉపాధ్యాయులన్నారు.ప్రభుత్వ పాఠశాలలకు పునర్‌వైభవం రానుందని, విద్యార్థులకు నాణ్యమైన,గుణాత్మక విద్య అందించాలని సూచించారు.
పాఠశాలలు ఆధునిక దేవాలనయాలనీ,వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపై ఉందన్నారు.ఉత్తమ ఉపాధ్యాయులను విద్యార్థులు ఎపన్పటికి గుర్తుంచుకుంటారని తెలిపారు.కార్యక్రమంలో జడ్పిటీసీ సౌందర్య, జాగృతి రాష్ట్ర కార్యదర్శి బిక్షపతి,మాజీ ఎంపీపీ కాశీనాథ్,ఎంఈవో పోచయ్య, ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...