ఎరువుల కొరత లేదు..


Sat,September 7, 2019 11:58 PM

తూప్రాన్ రూరల్ : తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు. ముఖ్యంగా తూప్రాన్ మున్సిపాలిటీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆవరణలో శనివారం ఆర్డీవో శ్యాంప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ ఖాజా మోజీయొద్దీన్, 50 పడకల దవాఖాన సూపరింటెండెంట్ అమర్‌సింగ్, పంచాయతీరాజ్ డీఈ నర్సింహులు, వ్యవసాయశాఖాధికారులతో కలిసి హరితహారం కింద మొక్కలు నాటారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముందుగా వ్యవసాయ శాఖాధికారులతో ఆయన సమావేశమయ్యారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ఎరువుల కొరత లేదని, వ్యవసాయ రైతాంగానికి కావాల్సిన ఎరువులు తెప్పించి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా వాటిని రైతులకు అందించాలన్నారు. శనివారం సాయంత్రం వరకు రైతులకు సరిపడా మరో 20 మెట్రిక్ టన్నుల యూరియా అందుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడుతూ.. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, గుంతలతో ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నట్లు తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పట్టణంలోని కొన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు ప్రారంభం కాలేదని ఆయన పేర్కొనగా, వాటికి కొత్త ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో పనులు ప్రారంభిస్తామని పంచాయతీరాజ్ డీఈ నర్సింహులు గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడికి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో కృష్ణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, నాచారం దేవస్థానం కమిటీ డైరెక్టర్ పల్లెమీది చంద్రారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...