గ్రామ అభివృద్ధే లక్ష్యం


Sat,September 7, 2019 11:58 PM

చేగుంట: 30 రోజుల్లో గ్రామ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఎల్‌పీవో వరలక్ష్మి పేర్కొన్నారు. నార్సింగి మండలంలోని జప్తిశివునూర్, మండలకేంద్రమైన చేగుంట, రెడ్డిపల్లి, మక్కరాజిపేట, కర్నాల్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం 30రోజుల్లో తీసుకునే కార్యాచరణపై గ్రామస్తులకు సంబంధిత ప్రత్యేక అధికారులు అవగాహన కల్పించి, కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో వరలక్ష్మి మాట్లాడుతూ పల్లెలో ప్రగతిని సాధించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి తమ వంతు సహకారంగా ప్రతిఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

గ్రామ అభివృద్ధి కోసం అన్ని గ్రామాల్లో కమిటీలను వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మండలపరిషత్ ఉపాధ్యక్షురాలు సుజాత, సర్పంచ్ షేక్ షరీఫ్, మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్ ఆర్‌ఐ అజారుద్దీన్, పంచాయతీ కార్యదర్శి నరేందర్‌తో పాటు గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చేగుంటలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, సర్పంచులు కాశగోని లక్ష్మి, కుమ్మరి శ్రీనివాస్, గణపురం సంతోశ్‌రెడ్డి, తహసీల్దార్ గోవర్ధన్, ఉప తహసీల్దార్ శ్రీనివాస్, ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఎంపీటీసీలు బండి కవిత, శంబుని రవి, కార్యదర్శులు రాని, జగదీశ్, ఉప సర్పంచులు వార్డు సభ్యులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.

పల్లెలో మొదలైన ప్రగతి..
మండలపరిధిలోని పలు గ్రామాల్లో 30రోజుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కర్నాల్‌పల్లిలో వృద్ధ దంపతులు తన ఇంటి చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను తొలిగించారు. రెడ్డిపల్లిలో సర్పంచ్ కాశగోని లక్ష్మి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...