సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలి


Sat,September 7, 2019 11:55 PM

వెల్దుర్తి : పల్లెల సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టారని జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. ప్రల్లె ప్రగతి రెండోరోజూ శనివారం మండలంలోని ఉప్పులింగాపూర్, చర్లపల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు భాగ్యమ్మ, అశోక్‌రెడ్డిల అధ్యక్షతన నిర్వహించిన కో-ఆప్షన్, స్టాండింగ్ కమిటీల ఎన్నికకు జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, నాయకులు కృష్ణాగౌడ్, శేఖర్‌గౌడ్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాలలో జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి సాధించిన నాడే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని, అందుకే సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో, భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కో-ఆప్షన్, స్టాండింగ్ కమిటీల్లో అన్ని వర్గాలకు స్థానం కల్పించాలని, అందులో సగం సంఖ్యలో మహిళలకు చోటు కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు.

గ్రామాల్లో ఎన్నుకున్న కో-ఆప్షన్ సభ్యులు, కమిటీ మెంబర్లు సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రత్యేక అధికారులతో గ్రామాలలో పర్యటించి మురికి కాల్వలు, సీసీరోడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతల ఏర్పాటు, పాడుబడిన, పాత బోరుబావులను పూడ్చటం, వేలాడుతున్న తీగల తొలిగింపు వంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించాలన్నారు. అంతకుముందు ఉప్పులింగాపూర్, చర్లపల్లి గ్రామాల్లో పర్యటించిన జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పులింగాపూర్‌లో పాత గోడల తొలిగింపు పనులను ప్రారంభించారు. అలాగే చర్లపల్లి ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ అశోక్‌రెడ్డి, గ్రామస్తులు కోరగా పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమాలలో ఎంపీడీవో జగదీశ్వరాచారి, ప్రత్యేక అధికారి రేఖ, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు చందు, ఖాజా, మైసయ్య, హనుమంత్‌రావు, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పెంటారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రంజిత్, మధుసూదన్‌రెడ్డి, గంగాధర్, మహేశ్, సునందరెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు, యువకులున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...