తంగా అమలు చేయాలి


Sat,September 7, 2019 11:52 PM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : పల్లెల్లో గుణాత్మక మార్పు కోసమే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం తీసుకొచ్చిందని జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీబాయి అన్నారు. శనివారం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం మండల పరిధిలోని కాగజ్‌మద్దూర్ గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీబాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 30 రోజుల ప్రణాళికను గ్రామస్తులకు చదివి వినిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పల్లెలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే పల్లెప్రగతి కోసం రూపొందించిన ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అందరు కలిసికట్టుగా పనిచేసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు.

ప్రజలు భాగాస్వాములైనప్పుడే పల్లెలు అభివృద్ధి పథంలో ముందుంటాయని అన్నారు. ప్రభుత్వం రూపొందించిన 30 రోజుల ప్రణాళికల్లో భాగంగా గ్రామాల్లో డంపుయార్డుల కోసం స్థలాలను గుర్తించడం, పాడుబడ్డ బావులను గుర్తించడంతో పాటు పశువుల కొట్టాలను తొలిగించాలని చెప్పారు. హరితహరం కార్యక్రమం కింద మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శివకుమార్, ఏపీవో అంజిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...