కమిటీల భాగస్వామ్యంతోనే అభివృద్ధి


Sat,September 7, 2019 11:51 PM

రామాయంపేట రూరల్ : కమిటీల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో 30 రోజుల కార్యాచరణ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీసభ్యులు తమ వంతు కృషి చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. 5 సంవత్సరాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేసి గ్రామసభల్లో తెలుపాలన్నారు. మహిళలు ముందుకు వచ్చి గ్రామంలో నెలకొన్న సమస్యలను కమిటీల దృష్టికి తీసుకురావాలన్నారు.

అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లు తప్పక వినియోగించుకోవాలని సూచించారు. బహిరంగంగా మల విసర్జన చేస్తే వారికి జరిమానా విధించాలని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు తప్పకుండా గ్రామాల్లోనే ఉండాలన్నారు. ఇండ్ల వద్ద నీటి నిల్వలు, చెత్తా చెదారం నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ భిక్షపతి, కోనాపూర్ సర్పంచ్ దోమ చంద్రకళ, జెడ్పీటీసీ జెర్రిపోతుల సంధ్య, ఇరిగేషన్ ఈఈ ఏసయ్య, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, సిద్ధిరాంరెడ్డి, ఇమాన్నియల్, ఎంపీటీసీ సార్గ్ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...