ప్రణాళికను సమర్థవంగ్రామాభివృద్ధిలో..ప్రజలు భాగస్వాములు కావాలి


Sat,September 7, 2019 11:51 PM

మెదక్, నమస్తే తెలంగాణ / మెదక్ రూరల్ : గ్రామస్తులందరూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధి కమిటీలలో ప్రజలను భాగస్వాములు చేయడం జరుగుతుందని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శనివారం మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో సర్పంచ్ రజని అధ్యక్షతన జరిగిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు నేరుగా అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే గ్రామ పాలనలో గ్రామ కోఆప్షన్ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ప్రతి పల్లె సమగ్రాభివృద్ధి సాధించేందుకు గాను ప్రతి కమిటీ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. 30 రోజుల ప్రణాళికలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. హరితహారలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. పంచాయతీకి మంజూరు చేసే నిధులలో 10 శాతం నిధులు పచ్చధనం నిర్వహణ కోసం ఖర్చు చేసే వేసులుబాటు చట్టంలో కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామసభలో మెదక్ ఆర్డీవో సాయిరాం, ఎంపీపీ యమున, ఎంపీడీవో రాంబాబుతో వార్డు సభ్యులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...