14న జాతీయ లోక్ అదాలత్


Fri,September 6, 2019 11:46 PM

మెదక్, నమస్తే తెలంగాణ: జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని ఈనెల 14న మెదక్ కోర్టు కాంప్లెక్స్‌లోజరిగే జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి సుహాసిని, జూనియర్ సివిల్ జడ్జి పవన్‌కుమార్, ఎక్సైజ్, పోలీస్ అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కక్షిదారులకు వీలైనంత మేర న్యాయం జరిగేలా ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కోర్టు పరిధిలోని కక్షి దారులను లోక్ అదాలత్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు, పట్టణ, రూరల్ సీఐలు వెంకటయ్య, రాజశేకర్, ఎస్‌ఐలు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...