ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక


Fri,September 6, 2019 11:46 PM

మెదక్, నమస్తే తెలంగాణ : పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్‌బాల్ జట్టుకు 18 మందిని ఎంపిక చేసినట్లు ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వహణ కార్యదర్శి కిశోర్‌కుమార్ తెలిపారు. శుక్రవారం మెదక్ వెస్లీ పాఠశాల మైదానంలో ఎంపిక పోటీలను పట్టణ సీఐ వెంకటయ్య ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు తరలిరాగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ గల వారిని ఎంపిక చేసినట్లు కిషోర్‌కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి మధుమోహన్, వ్యాయమ ఉపాధ్యాయులు నాగరాజు, రూపేందర్, గణేశ్‌కుమార్, పద్మ, నబ్రీన్, గీత, శ్రీనివాస్, యాదగిరి, మెదక్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు ప్రశాంత్, కరుణాకర్ ఆనంద్, శ్రీనివాస్ చైతన్యదాస్ పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...