పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి


Fri,September 6, 2019 11:45 PM

నర్సాపూర్,నమస్తేతెలంగాణ: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఖాలేక్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సమస్యల సాధన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఎరువులను, విత్తనాలను, పురుగుల మందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే సరఫరా చేయాలని కోరారు. 60 సంవత్సరాలు నిండిన రైతులకు, వ్యవసాయ కూలీలకు చేతి వృత్తిదారులకు నెలకు రూ.10వేల పెన్షన్ ఇవ్వాలని అన్నారు. రైతుల వద్ద విత్తనాలను సర్టిఫై చేసి సమగ్రవిత్తన చట్టం తేవాలని తెలిపారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షురాలు ఏసుమణి, ప్రజానాట్యమండలి జిల్లా నాయకుడు నందం, సీపీఐ నాయకులు దయానంద్, యాదగిరి ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...