రోటా వాక్సిన్‌పై అవగాహన


Sun,August 25, 2019 03:08 AM

తూప్రాన్ రూరల్ : వర్షాకాలంలో వైరల్ ఫీవర్ వ్యాధులతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యాలకు గురవుతుంటారని, అయితే ఈ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ సీహెచ్‌వో వైద్య సిబ్బంది సూచించారు. మండలంలోని వెంకటరత్నాపూర్‌లో రోటా వాక్సిన్‌పై శనివారం ఏఎన్‌ఎంలు శ్యామల, సుకన్యలు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వ్యాధి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు వస్తుందన్నారు. ఈ వ్యాధి సోకిన చిన్నారులు వాంతులు, వీరేచనాలతో తరచూ బాధపడుతారన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్రామ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజేశ్‌లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...