నీటిని వృథా చేస్తేభవిష్యత్ అంధకారమే


Sun,August 25, 2019 03:08 AM

తూప్రాన్ రూరల్: అంతరించి పోతున్న భూగర్భ జలాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తూప్రాన్ మండలం యావాపూర్ సర్పంచ్ శేరి నర్సింహారెడ్డి అన్నారు. ప్రతి నీటి చుక్క వ్యర్థం కాకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్‌లో మానవుని మనుగడ సాధ్యపడుతుందని, లేకపోతే నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
తూప్రాన్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం జలక్తి అభియాన్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు శేరి నర్సింహారెడ్డి, భగవాన్‌రెడ్డి, మిద్దింటి పుష్పానవీన్, శ్రీలతరాజిరెడ్డి, లంబవెంకటమ్మ, పిట్ల పోచయ్య, జంగం సుకన్య, పాంబండ జనమ్మ, వెంకట్రామ్‌రెడ్డి, గుర్రం ఎల్లంలతో పాటు ఎంపీటీసీలు సంతోశ్‌రెడ్డి, జవాన్ల నర్సమ్మ, పంజాల వెంటమ్మ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టీఆర్‌ఎస్ నాయకులు చంద్రశేఖర్, కుమ్మరి నిర్సింహులు, పంచాయతీ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...