వర్షం నీటిని ఒడిసి పట్టుకుందాం


Sun,August 25, 2019 03:07 AM

వర్షం పడిన ప్రతి నీటి బోట్టును ఒడిసి పట్టుకుందామని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, చేగుంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేగుంటతో పాటు రాంపూర్, కరీంనగర్, చిన్నశివునూర్, రుక్మాపూర్, చెట్లతిమ్మాయిపల్లి నడిమితండా, కసాన్‌పల్లి తదితర గ్రామాల్లో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో శనివారం గ్రామసభలను నిర్వహించారు. చేగుంట, రాంపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ పాల్గొన్నారు. చేగుంటలో నిర్వహించిన గ్రామ సభలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రతి ఇంటికి ఇకుండుగుంత అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బస్కి స్వప్న అంజిరెడ్డి, స్వాతిశ్రీనివాస్, ఎంపీటీసీలు గాండ్ల లతనందం, ఉప సర్పంచ్ సురేఖ, వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...