గ్రామస్తుల సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యం


Sun,August 25, 2019 03:06 AM

నర్సాపూర్‌రూరల్: గ్రామస్తుల సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యపడుతుందని గోమారం గ్రామ సర్పంచ్ లావణ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి పేర్కొన్నారు. శనివారం శివ్వంపేట్ మండల పరిధిలోని గోమారం గ్రామంలో సర్పంచ్ లావణ్య అధ్యక్షతనలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులు నీటిని పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఇంటి ఆవరణంలో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. అలాగే గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేసి నాటడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, విజయ్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...