మున్సిపల్ కార్యాలయంలో మొక్కల పంపిణీ


Sun,August 25, 2019 03:05 AM

నర్సాపూర్,నమస్తే తెలంగాణ: నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్‌పీలు శోభా, అనిత తదితరులు మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీకి మొత్తం 7500 మొక్కలు వచ్చాయని తెలిపారు. ఇందులో జామ, ఉసిరి. గుల్మోర్ ఉన్నాయని చెప్పారు. మొక్కలను పట్టణంలోని అంబేద్కర్ కాలనీ, చైతన్యపురి కాలనీ, జగన్నాథరావుకాలనీ, సునీతాలకా్ష్మరెడ్డి కాలనీ, మున్సిపల్‌కాలనీ, హన్మంతాపూర్‌లోని మెప్మా సభ్యులకు అందించి ప్రతిఇంటికి అందజేయాలని సూచిస్తామని తెలిపారు. ఈ సమయంలో మెప్మా ఆర్‌పీలు పుష్ప, మాధవి, రమ, శివలీల, సోని, పద్మ, మున్సిపల్ సిబ్బంది విష్ణు, పాపరావు, సుధాకర్ ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...