విద్యతో పాటు క్రీడలూ ముఖ్యమే


Sun,August 25, 2019 03:05 AM

కొండాపూర్: చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యమని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్ చౌహాన్ పేర్కొన్నారు. శనివారం కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో ఉమ్మడి పది జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయికి క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ చౌహాన్ మాట్లాడుతూ రాష్ట్ర గురుకులాల సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన అనంతరం రాష్ట్ర స్థాయి ఎంపిక చేసేందుకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్‌బాల్‌లలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి ఎంపిక చేశారు. కబడ్డీలో 12 మంది, వాలీబాల్‌లో 12 మంది, హ్యాండ్‌బాల్‌లో 9 మంది, ఖోఖోలో 12 మంది అండర్ -19 విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అనంతరం ఆర్‌సీవో బాలస్వామి మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలలో అవకాశం కల్పించడం ఎంతో సంతోషకరమన్నారు. ఎలాంటి క్రీడలు నిర్వహించాలన్నా, క్రీడలను ఎంపిక చేయాలన్నా కొండాపూర్‌లోని గిర్మాపూర్ పాఠశాల వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఎంపీపీ మనోజ్‌రెడ్డిలు మాట్లాడుతూ ఆటల పోటీల్లో గెలుపోటములు సహజమని, విద్యార్థులు గెలిచినా ఓడినా సంతోషంగా ఉండాలని సూచించారు.
ఇలాంటి కార్యక్రమాలు తాము చదువుకున్న సమయాల్లో లేవని, ప్రస్తుతం సర్కార్ ఏర్పాటు తర్వాత విద్యార్థులు బాగుపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. భవిష్యత్‌లో విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా ప్రతి విద్యార్థికి అవసరమని వారు సూచించారు. రాష్ట్రస్థాయి ఎంపికైన విద్యార్థులకు టీషట్స్, షాట్స్, క్రీడాధికారులకు కూడా వాటిని పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీపీ మనోజ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి గణపతి, పీడీలు లాలు, విద్యార్థులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...