జాతీయ పురస్కారం అందుకున్న భూమేశ్


Sun,August 25, 2019 03:04 AM

పాపన్నపేట: మండలంలోని మిన్పూర్ గ్రామానికి చెందిన రాపల్లి భూమేశ్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారు జాతీయ పురస్కారాలు అందజేశారు. అందులో భాగంగా పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన జానపద కళాకారుడైన రాపల్లి భూమేశ్ కూడా ఈ జాతీయ ప్రతిభ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డు రావడంపై గ్రామ సర్పంచ్ మర్రిలింగారెడ్డి, ఎంపీటీసీ వడ్ల కుబేరుడు, పలువురు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.
కొల్చారం: మండలానికి చెందిన ఇద్దరు కళాకారులకు శనివారం సన్మానం జరిగింది. వరిగుంతం గ్రామానికి చెందిన కమ్మరి శేఖరాచారి, ఎనగండ్ల గ్రామానికి చెందిన లయా కళా బృందం శేఖర్‌గౌడ్‌లు ఎంపిక కాగా, శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరికి అవార్డులను ప్రదానం చేశారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...