జిల్లాకు జాతీయస్థాయి అవార్డులు


Sun,August 25, 2019 03:03 AM

మెదక్, నమస్తే తెలంగాణ: జిల్లాకు చెందిన సమాచార శాఖ సాంస్కృతిక కళాకారులు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు 2019 సంవత్సరానికి గాను న్యూఢీల్లీలోని అంబేద్కర్ ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక కళాకారులు నాగరాజు, సత్యనారాయణ, భిక్షపతి, సుభాశ్, మాధవి, మదన్, నేనావత్ రవి, తేజస్వీనులకు సుప్రీంకోర్టు జెడ్జీ పీఎస్ నారాయణ, తెలంగాణ హైకోర్టు జస్టీస్ మధుసూదన్‌రావు, ఎంపీ వేణుగోపాలచారి, ఎన్‌డీసీఏ చైర్మన్ డాక్టర్ బీఎంజీ అర్జున్‌ల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు.
ఉమ్మడి రామాయంపేట కళాకారులకు అవార్డుల ప్రదానం
రామాయంపేట: ఉమ్మడి రామాయంపేట మండలం డీ.ధర్మారం గ్రామానికి చెందిన సాకలి కృష్ణ, కల్వకుంట గ్రామానికి చెందిన మువ్వల కళాబృందం అధ్యక్షుడు పల్లపు స్వామిలకు ప్రభుత్వం జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో కళానైపుణ్యతను కనబర్చిన 200 మంది కళాకారులను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట ఉమ్మడి మండలానికి చెందిన ఇద్దరు కళాకారులు స్వామి, కృష్ణలను ఎంపిక చేసి ఢిల్లీలోని కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో కళా విభాగంలో తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో కళారంగంలో ప్రతిభను కనబర్చిన కళాకారులకు నేషనల్ అవార్డును ఢిల్లీలోని ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఎస్.నారాయణ శనివారం ప్రదానం చేశారు. గత 14 సంవత్సరాలుగా సాంస్కృతిక పరంగా కళారంగంలో చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా తమకు ఈ అవార్డు రావడం జరిగిందని అవార్డు గ్రహీతలు కల్వకుంట పల్లపు స్వామి, ఢీ ధర్మారం కృష్ణలు నమస్తేతెలంగాణ విలేకరితో ఫోన్‌లో తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...