ఇంటింటికీ సర్వే చేయాలి


Sat,August 24, 2019 02:17 AM

-మర్రి, రావి, మేడి, ఇప్ప విత్తనాలకుప్రైమరీ బెడ్స్ వేయండి
-పాఠశాలలు, వసతిగృహాలలోపొగడ చెట్లు నాటేలా చూడాలిఅధికారులతో కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్ కలెక్టరేట్: స్థలాలు అందుబాటులో ఉన్న అన్ని గ్రామాలలో తక్షణం నర్సరీల నిర్వహణ చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గ్రీన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో నర్సరీలు ఉండటం కాకుండా గ్రామపంచాయతీ స్థలాలలో నర్సరీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో జిల్లాలోని గ్రామ పంచాయతీలలో స్థలాలు అందుబాటులో లేకపోవడం వల్ల స్థలాలు అందుబాటులో ఉన్న గ్రామాలలోనైనా ఈ సంవత్సరం నుంచి నర్సరీలను ఏర్పాటు చేసేలా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వనసేవకులు నర్సరీల నిర్వహణ సరిగా చేపట్టని గ్రామాలలో సైతం ఈ సంవత్సరం నర్సరీల నిర్వహణ గ్రామపంచాయతీలే చూసుకోవాలన్నారు.
పాత ప్రదేశాలలో నర్సరీలను ఏర్పాటు చేసేవారు ఉన్న స్టాకును జాగత్రత్తగా మార్చేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే గత సంవత్సరంనకు దోరకని విత్తనాలైన మారెడు, ఇప్ప, పనస వంటి విత్తనాలను సేకరించడం ఇప్పటి నుంచే ప్రారంభించాలన్నారు. అంతే కాకుండా మర్రి, రావి, ఇప్ప విత్తనాలతో ప్రైమరీ బెడ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలలో లేఅవుగట్‌లలో రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా పోగడ చెట్లు నాటేందకుగానూ చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, వసతిగృహాలు ఖాళీ ప్రదేశాలలో అన్ని రకాల మొక్కలను నాటాలని సూచించారు. ఈవిషయంలో ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక కృషి చేయాలన్నారు. వచ్చే సంవత్సరం నిర్వహించే హరితహారం కార్యక్రమానికి సంబంధించి నర్సరీలలో మొక్కలను పెంచేందుకు గానూ ఇంటింటికీ తిరిగి వారికి అవసరమైన మొక్కలను తెలుసుకోవాలన్నారు. అపుడే వారి అభిరుచికి తగ్గ మొక్కలను నర్సరీలలో సిద్ధం చేయవచ్చు అని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికి కరివేపాకు, చింత, నిమ్మ మొక్కలు పంపిణీ చేసే విధంగా అన్ని నర్సరీలలో ఈ మొక్కలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

గ్రామాలలోని రైతులకు సైతం అవసరం ఉన్న మొక్కలను తెలుసుకునేందుకు గానూ ఏఈవోలతో సర్వే చేయాలని సూచించారు. బ్లాక్ ప్లాంటేషన్ ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి సీతాఫలం మొక్కలను అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు. మూడు కిలోమీటర్ల దూరం దారి ఉన్న ప్రతి గ్రామపంచాయతీ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని డీపీవో హనోక్‌కు సూచించారు. వేసవి కాలంలో సైతం పచ్చదనంతో ఉండే మొక్కలను గుర్తించాలని జిల్లాలో ఉన్న కొండ, గుట్ట ప్రాంతాలలో అలాంటి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌వో పద్మజారాణికి సూచించారు. ఈ సమావేశంలో జేసీ నగేశ్, డీఆర్‌డీవో సీతారామారావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ ఏడీ వెంకటయ్య, డీఎవో పరుశురాంనాయక్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...