జిల్లాను ప్రథమస్థానంలో ఉంచాలి


Sat,August 24, 2019 02:07 AM

మెదక్ అర్బన్: రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి ర్యాంకుల కోసం మన మెదక్ జిల్లాను మొదటి స్థానంలో ఉంచడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని, వారి మొబైల్ నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ఓటింగ్‌లో పాల్గొని మెదక్ జిల్లా జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లా ప్రజలకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాయాగార్డెన్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శుల కార్యక్రమంలో పాల్గొన్ని స్వచ్ఛసర్వేక్షణ్ బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ గుగూల్ ప్లేస్టోర్ నుంచి ఎస్.ఎస్.జి 2019 అనే ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రాష్ట్రం, జిల్లాను సెలెక్ట్ చేసుకుని స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకులు వచ్చేలా ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు వారి మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. అలాగే ప్రతిఒక్కరూ ఈ ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ సూచించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...