జెడ్పీస్థాయి సంఘాల ఏర్పాటుకు కసరత్తు


Sat,August 24, 2019 02:06 AM

మెదక్ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: నూతన జిల్లా పరిషత్‌లకు స్థాయి సంఘాలు ఏర్పాటుకు కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది. జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం 20 మండలాలకు గతంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నికైన వెంటనే స్థాయి సంఘాలను ఏర్పాటు చేసుకొనేవారు. పరిపాలనకు సంబంధించి జిల్లా పరిషత్ స్థాయి సంఘాలే కీలకంగా ఉంటాయి. జిల్లా పరిషత్ పరిధిలో 7 స్థాయి సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో జెడ్పీటీసీ సభ్యులతో పాటు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరాబాద్, జిల్లా పరిధిలో ఉండడంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుతో పాటు ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్సీలు, శేరిసుభాశ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రఘోత్తమ్‌రెడ్డిలు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, సోలిపేట రాంలింగారెడ్డి, భూపాల్‌రెడ్డిలు జెడ్పీస్థాయి సంఘ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు 20 మంది జెడ్పీటీసీలు, ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులు కలిపి జిల్లా పరిషత్‌లో సభ్యుల సంఖ్య 34మందికి చేరనున్నది.

7స్థాయి సంఘాలు..
జిల్లా పరిషత్ 7 స్థాయి సంఘాల కమిటీలు ఉంటాయి. వ్యవసాయం, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనులు ప్రణాళికల విభాగాల స్థాయి సంఘాల కమిటీలు ఉంటాయి. కొన్ని కమిటీలకు నేరుగా జెడ్పీ చైర్మన్ హేమలతనే చైర్మన్‌గా ప్రాతినిథ్యం వహిస్తారు. మరికొన్ని కమిటీలకు జెడ్పీటీసీలు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సైతం చోటు కల్పించనున్నారు. మెదక్ జిల్లా పరిషత్‌లో పూర్తిస్థాయిలో ఇద్దరు జెడ్పీటీసీలు కాంగ్రెస్ మినహా మొత్తం18 మంది సభ్యులు టీఆర్‌ఎస్ పార్టీ సభ్యులే గెలుపొందడంతో అన్ని స్థాయి సంఘాల కమిటీలు ఏకగ్రీవం కానున్నాయి. పూర్తి స్థాయిలో ఎన్నిక ప్రక్రియ ముగించి 26న ప్రత్యేక సమావేశం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ర్యాకల హేమలత అధ్యక్షతన జరుగనున్నది. ఈ సమావేశంలో స్థాయి సంఘాల చైర్మన్‌లు, సభ్యుల వివరాలు ప్రకటించనున్నారు.

34కు చేరనున్న సభ్యుల సంఖ్య..
20 మంది జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులు ఇద్దరు ఎంపీలు నలుగురు ఎమ్మెల్సీలు, ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 34మంది సభ్యులు జిల్లా పరిషత్‌లో ఉండనున్నారు. సమస్యలను గుర్తించి జిల్లాస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారులతో చర్చించి తీర్మానాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వేదికగా జిల్లా పరిషత్ మార్గంగా నిలుస్తుంది. జిల్లా పరిషత్‌లో స్థాయి సంఘాలదే కీలక పాత్ర, 7 సంఘాల్లో ఆర్థిక ప్రణాళిక వ్యవసాయం, విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనుల కమిటీలు జిల్లా అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించనున్నాయి. ఈ కమిటీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, సభ్యులు జిల్లా అధికారులతో సమస్యలు చర్చించి తీసుకునే నిర్ణయాలు జిల్లా అభివృద్ధికి దోహదపడనున్నాయి.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...