పోలీస్ నిబంధనలు పాటించాలి


Sat,August 24, 2019 02:05 AM

రామాయంపేట:వాహనదారులు పోలీస్ నిబంధనలను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని రామయంపేట ఎస్‌ఐ మహేందర్ అన్నారు. శుక్రవారం రామాయంపేటలో వాహనాల తనిఖీ అనంతరం ఆయన మాట్లాడారు. నూతన చట్టంలో పోలీస్ నిబంధనలు కఠినంగా ఉన్నాయని ఏ మాత్రం పాటించకుండా ఉంటే చర్యలు తప్పవన్నారు. సీటుబెల్టు, హెల్మెట్ ధరించకున్న, ఎమర్జెన్సీ వెహికల్‌కు దారి ఇవ్వకుంటే రూ.10వేలు, అతి వేగం, రేసింగ్ కారు, లైసెన్స్ లేకుండా వాహనం నడిపిస్తే రూ.5వేలు,డ్రంకన్ డ్రైవ్‌కు రూ.10వేలు, ఓవర్‌లోడింగ్‌కు రూ.20వేలు, సెల్‌ఫోన్ నడుపుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5వేలు, పర్మిట్ లేకుండా వాహనం నడిపితే రూ.10 వేలు, ఇన్సూరెన్స్ లేకుండా ఉంటే రూ.2 వేలు జరిమానా విదించడం జరుగుతుందన్నారు. పోలీస్ నిబంధనలు పాటించని ఎంతటి వారిపైనైనా కేసులు, జరిమానాలు తప్పవని అన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...