రైతుబీమా పత్రాల్లో మార్పులకు అవకాశం


Sat,August 24, 2019 02:04 AM

టేక్మాల్: రైతు బీమాకు సంబంధించి పత్రాల్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే వెంటనే చేయించుకోవాలని ఏవో రాంప్రసాద్ తెలిపారు. గత యేడాది రైతు బీమా చేయించుకున్న అర్హత కలిగిన రైతుల బీమాను రెన్యూవల్ చేయడం జరుగుతుందన్నారు. 18ఏండ్లు నిండిన రైతులు కొత్తగా నమోదు చేసుకునేవారివి నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే బీమా పత్రాల్లో నామినీ, బ్యాంకు ఖాతా, ఆధార్‌నెంబర్, పట్టాపాసు పుస్తకం వివరాల్లో ఏమైనా మార్పులు చేయించుకోవాల్సిన వారు వెంటనే ఏఈవోలను సంప్రదించి వాటిని సరిచేసుకోవాలని సూచించారు. రైతు బీమా విషయంలో సందేహాలు వుంటే నేరుగా కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...