మొక్కలు నాటి సంరక్షించాలి


Sat,August 24, 2019 02:04 AM

అల్లాదుర్గం: గ్రామంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని రక్షించాలని ఏఈవో మహేశ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బహిరన్‌దిబ్బ గ్రామంలో మొక్కలు నాటి వాటికి టీగార్డులను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటి వాటి రక్షించే బాధ్యతలు తీసుకోవాలన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రభు,సాయిలు, దత్తు, శ్రీకాంత్ పాల్గొన్నారు.

మెదక్ అర్బన్‌లో..
మెదక్ అర్బన్: హరితహార కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని షెడ్యూల్‌కూలాల అభివృద్ధి సహాయక అధికారి కవిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌సీడీడీ బాలుర వసతి గృహంలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పభుత్వం హరితహార కార్యక్రమం చేపట్టిందని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ తులసిరాం, సిబ్బంది రేఖ, జ్యోతి, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...