విద్యార్థిని చితుకబాదిన వాచ్‌మెన్


Sat,August 24, 2019 02:03 AM

కొల్చారం: వాచ్‌మెన్ నిర్వాహకంతో విద్యార్థి మూ డు రోజులుగా కనిపించకుండా పోయి శుక్రవారం సంగారెడ్డిలో ప్రత్యక్షమయ్యాడు.అంబేద్కర్ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం... కొల్చా రం మండలం రంగంపేటలోని ఎస్సీ హాస్టల్‌లో ఎనిమిదోతరగతి చదువుతున్న నాయిన్‌జలాల్‌పూర్ తండా కు చెందిన రవిని హాస్టల్ వాచ్‌మెన్ నారాగౌడ్ మం గళవారం రాత్రి చితుకబాదటంతో వంటిపై (వాతలు) వచ్చాయి. బుధవారం పాఠశాలకని పోయి సంగారెడ్డి బస్సు ఎక్కా డు. సంగారెడ్డిలో రవిమామ అడ్రసు దొరక్కపోగా బుధవారం రాత్రిపూట పోలీసులకు అనుమానంగా కనిపించడంతో మథర్ థెరిస్సా ట్రస్టులో ఉంచారు. పొలీసులు ఇచ్చిన సమాచారంతో విద్యార్థి తల్లిదండ్రులు సంగారెడ్డికి పోయి విషయం తెలుసుకుని వాచ్‌మెన్ నారాగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం కొల్చారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని చితుకబాదిన వాచ్‌మెన్ నారాగౌడ్‌పై కేసు నమోదు చేయాలని అంబేడ్కర్ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు సురేశ్ డిమాండు చేశారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...