నేడు వెల్దుర్తికి జెడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్, ఎమ్మెల్యేల రాక


Fri,August 23, 2019 04:49 AM

వెల్దుర్తి: వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించనున్న హరితహారంలో పాల్గొనడానికి జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డిలు హాజరుకానున్నట్లు జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, నాయకులు ఆంజనేయులు, ప్రతాప్‌రెడ్డిలు తెలిపారు. వెల్దుర్తిలో వారు గురువారం విలేకరులతో మాట్లాడుతూ... వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్ పంచాయతీ మల్లన్నగుట్ట, ఆరెగూడెం, ఉప్పులింగాపూర్, శెట్‌పల్లి, రామాయిపల్లి, బండపోసాన్‌పల్లి, ఏదులపల్లి గ్రామాల్లో నిర్వహించే హరితహారంలో పాల్గొని మొక్కలను నాటనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో నాయకులు కృష్ణాగౌడ్, శంకర్‌రెడ్డి, మైసయ్య, నాగరాజు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...