ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించాలి


Fri,August 23, 2019 04:49 AM

మెదక్ కలెక్టరేట్: అక్టోబర్ -2019లో జరిగే ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజులను చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డా.రవికాంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్ పొంది పరీక్షలకు హాజరుకాని వారు, పరీక్షలకు హాజరై ఫెయిల్ అయిన వారు ఈ పరీక్షలు రాయడానికి అర్హులు అని తెలిపారు. పదవ తరగతి థియరీ పరీక్షలకు రూ. 100, ప్రాక్టికల్ పరీక్షలకు రూ.50, ఇంటర్ విద్యార్థులు థియరీ పరీక్షలకు రూ.150, ప్రాక్టికల్ పరీక్షలకు రూ.100ల ఫీజు చెల్లించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రూ.25 అపరాధ రుసుంతో ఈనెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు రూ.50 అపరాధ రుసుంతో వచ్చేనెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు అన్నారు. ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల సమన్వయకర్తలు, ఇబ్బంది ఈవిషయంపై విస్తృత ప్రచారం చేసి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వివరాలకు జిల్లా ఓపెన్ స్కూల్ సమన్వయకర్త ఎస్.వెంకటస్వామిని సెల్.నం.8008403635లో సంప్రదించాలని ఒక ప్రకటనలో కోరారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...