సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడ ప్రమాణ స్వీకారం


Fri,August 23, 2019 04:48 AM

టేక్మాల్: రాష్ట్ర పంచాయతీ సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎల్లుపేట సర్పంచ్ సాయిలు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అందులో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆయనకు రాష్ట్ర పంచాయతీ సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న నియామక పత్రాన్ని అందజేశారు. తనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు వ్యవస్థాపక అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...