హరిత తెలంగాణను సాధిద్దాం


Thu,August 22, 2019 12:00 AM

నిజాంపేట: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని తద్వార హరితతెలంగాణను సాధించవచ్చని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధి నస్కల్‌ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విచ్చేసి, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, అధికారులు, గ్రామప్రజలతో కలిసి మెగాప్లాంటేషన్‌లో భాగంగా 4000మొక్కలను నాటారు. వీటిని సంరక్షించుకోవాలని పాఠశాల విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని మొక్కలు నాటి విజయవంతం చేసి ఆకుపచ్చ, ఆరోగ్య తెలంగాణను రూపొందించడంతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, తాగునీటి కొరత కరెంట్‌ కష్టాలు లేకుండా చేయడమే గ్రామస్వరాజ్యం ముఖ్య ఉద్దేశమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రైతుల కష్టాలు తీరుతాయని, రాబోయే రోజుల్లో నిజాంపేట మండలానికి 19వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, తహసీల్దార్‌ జైరాంలు, ఏవో సతీశ్‌, ఏపీవో రాజ్‌కుమార్‌, ఎంపీపీ దేశెట్టి సిద్దరాములు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కో-ఆప్షన్‌ గౌస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కిష్టారెడ్డి, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఆయాగ్రామల సర్పంచ్‌లు కర్రయ్య, అమరసేనారెడ్డి, నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు బాల్‌రెడ్డి, సురేశ్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు కొండల్‌రెడ్డి, అబ్దుల్‌, సంగుస్వామి రవి, నగేశ్‌ పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...