ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి


Wed,August 21, 2019 11:59 PM

చిన్నశంకరంపేట : వాణిజ్య వ్యాపార సంస్థల నిర్వాహకులు ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌ హెచ్చరించారు. బుధవారం మండలంలోని అంబాజిపేట, గవ్వలపల్లి గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీపీవో గవ్వలపల్లి చౌరస్తాలోని దుకాణా యజమానులకు ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించొద్దని నోటీసులను అందజేశారు. అనంతరం డీపీవో మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తే వచ్చే అనర్థ్ధాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సంపూర్ణ పారిశుధ్యం కోసం ప్రజలంతా సహకరించాలన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా చెత్తను పారవేయవద్దన్నారు. మురికి నీరు నిలిస్తే దోమలు వృద్ధి చెంది వ్యాధులు వస్తాయన్నారు. నిర్మించుకున్న మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు. వనాలు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సాయిలు, పంచాయతీ ఈవో లక్ష్మణాచారి, పంచాయతీ కార్యదర్శులు జ్యోతి, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...