గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు


Wed,August 21, 2019 11:59 PM

హవేళిఘనపూర్‌ : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారని, టార్గెట్‌ ప్రకారమే విధులు, నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తొగిట గ్రామంతోపాటు పలు గ్రామాలకు చెందిన 44 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సుజాతశ్రీనివాస్‌రెడ్డిలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌, వార్డు సభ్యులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ‘కల్యాణలక్ష్మి’తో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, వైస్‌ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్‌, ఎంపీటీసీ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్‌, తహసీల్దార్‌ వెంకటేశం, మెదక్‌ మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, సర్పంచ్‌ మంద శ్రీహరి, చింతల నర్సింలు, ఆర్కె శ్రీను, మాయ మల్లేశం, గిద్దావర్‌ శ్రీహరి, రాజేందర్‌రెడ్డి, యామిరెడ్డి, చెన్నాగౌడ్‌, దేవాగౌడ్‌, వినోద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నరేందర్‌రెడ్డి, మేకల సాయిలు, శ్రీహరి, గణపతి, రాంచంద్రారెడ్డి, శ్రీకాంత్‌, శంకర్‌, కో అప్షన్‌ సభ్యులు ఖాలేద్‌, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...