ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో హరితహారం


Wed,August 21, 2019 11:58 PM

రేగోడ్‌: మండల పరిధిలోని రేగోడ్‌, కొత్వాన్‌పల్లి గ్రామాల్లో హరితహార కార్యక్రమాన్ని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు మెదక్‌ ఎక్సైజ్‌ సీఐ గోపాల్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. బతుకమ్మల కుంట, పెద్దచెరువు కట్టలపై ఈత మొక్కలను నాటారు. 1500 ఈత మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ముబీన్‌ అహ్మద్‌ ఖురే షి, కానిస్టేబుల్‌ పండరి, సాయిలు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, గౌడ్‌ సంఘం నాయకులు పాల్గొన్నారు.

మెదక్‌ రూరల్‌లో
మెదక్‌ రూరల్‌: ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎక్సైజ్‌ సీఐ గోపాల్‌ అన్నా రు.హరితహారంలో బుధవారం మండల పరిధిలో ని మంబోజిపల్లిలో పల్లె చెరువు గట్టుపై ఈత మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ గోపాల్‌ మా ట్లాడుతూ హరితహార కా ర్యక్రమాన్ని విజయవం తం చేయాలని తమశాఖ ఆధ్వర్యంలో ఈత మొ క్క లు నాటే కార్యక్రమా న్నిచేపట్టామన్నారు. మొక్క లు నాటడమే కాకుండా వా టిన సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఎస్సై రహమత్‌ పాషా, కానిస్టేబుల్‌ రవి, ఎంపీటీసీలు మానస, రాములు, ఉపసర్పంచ్‌ సత్తయ్య, ఫీల్డ్‌అసిస్టెంట్‌ శారద, పాల్గొన్నారు.

చిన్నశంకరంపేటలో...
చిన్నశంకరంపేట: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీడీవో లక్ష్మణమూర్తి సూచించారు. బుధవారం మండల పరిధిలోని భాగిర్తిపల్లిలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మణమూర్తి మాట్లాడుతూ నాటిన మొక్కలను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అనురాధ, సర్పంచ్‌ దయానంద్‌యాదవ్‌, వార్డు సభ్యులు, ఈజీఎస్‌ సిబ్బంది,పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...