ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాల


Wed,August 21, 2019 11:57 PM

టేక్మాల్‌: మహిళా సమైక్యలోని గ్రూపు సభ్యులు ప్రతి ఒక్కరూ విధిగా ఐదు మొక్కలు నాటి, వాటిని పెంచాలని ఎంపీడీవో విష్ణువర్ధన్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మహిళా సమైక్య సమావేశ మందిరంలో బుధవారం సమైక్య సిబ్బంది, గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే మండల సమైక్య ఇచ్చే రుణాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నాగరాజు, మండల సమైక్య సిబ్బంది, సంఘాల సభ్యులు ఉన్నారు.

పెద్దశంకరంపేటలో ....
పెద్దశంకరంపేట: గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు హరితహారం మొక్కలపై శ్రద్ధ వహించాలని ఎంపీడీవో బన్సీలాల్‌ అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాలోని నర్సరీల్లో పంపిణీకాని మొక్కల విషయంలో తగిన శ్రద్ధ వహించాలన్నారు.

మండల పరిధిలోని ఆరెపల్లి గ్రామంలో తహసీల్దార్‌ కిష్టానాయక్‌ బుధవారంం మొక్కలను నాటిన అనం తరం సమావేశంలో మాట్లాడారు. మండలంలోని ఖా ళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సైతం హరితహార మొ క్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

హవేళిఘనపూర్‌లో
హవేళిఘనపూర్‌: ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని లింగ్సాన్‌పల్లి సర్పంచ్‌ మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని లింగ్సాన్‌పల్లి గ్రామపంచాయతీలో గ్రామసభను ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో మొక్కలు నాటాలని సూచించారు. ప్రభు త్వ లక్ష్యం మేరకు ఇంటికి ఐదు మొక్కలు నాటడంతో పాటు పెన్షన్‌ లబ్ధిదారులు ఒక్క మొక్కను నాటాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో రాకేశ్‌, గ్రామపంచాయతీ సెక్రటరీ రేణుక, వార్డు సభ్యులు ఉన్నారు. అలాగే మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి గ్రామసర్పంచ్‌ భాగ్యలక్ష్మి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు ఉన్నారు

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...