అల్లాదుర్గంలో.


Wed,August 21, 2019 11:53 PM

అల్లాదుర్గం: ప్రాథమిక సహకార సంఘంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని రాష్ట్ర సహకార సంఘం ప్రిన్సిపాల్‌ వెంకన్న అన్నారు. మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని వ్యవసాయ సహకార సంఘం సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సభ్యులకు వ్యాపార అవకాశాలు, రుణాల వసూలు కొత్త రుణాలు ఇవ్వడం, తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌టీ రుణాలలో 60శాతం చెల్లించిన వారికి వ్యవసాయ రుణం కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. సహకార సంఘంలో డిపాజిట్లు వచ్చే విధంగా ఉద్యోగులు, సంఘం సభ్యులు కృషి చేయాలన్నారు. డిపాజిట్లతో పెట్రోల్‌ బంక్‌ , కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం లాంటివి ఏర్పాటు చేయవచ్చన్నారు. ప్రతి సభ్యుడికి సంఘం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, సర్పంచ్‌ అంజియాదవ్‌, అల్లాదుర్గం పీఏసీఎస్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...