సకాలంలోరుణాలు చెల్లించాలి


Wed,August 21, 2019 11:53 PM

కొల్చారం: వ్యవసాయ సహకార సం ఘం అభివృద్ధికి సభ్యులు సహకరించాలని రాష్ట్ర సహకార యూనియన్‌ ప్రిన్సిపాల్‌ వెంకన్న కోరారు. బుధవారం సొసైటీ చైర్మన్‌ వీపీ మల్లేశం అధ్యక్షతన సొసైటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భం గా రైతులందరికీ నాయ కత్వ లక్షణాల గురించి వివరించారు. అలాగే సభ్యులకు వ్యాపారావకాశాలు, రుణాల వసూలు, కొత్త రుణాలివ్వడం, అధికారాల గురించి వివరించారు. వ్యాపార అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో నవీన్‌, సిబ్బంది బాలకిషన్‌, భిక్షపతి, బీరప్ప, శ్రీనివాస్‌, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...