పోలీస్‌ స్టేషన్ల రైటర్లకు ఒకరోజుశిక్షణ


Wed,August 21, 2019 11:52 PM

మెదక్‌ మున్సిపాలిటీ: డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ చందనదీప్తి సూచనల మేరకు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని పోలీస్‌ స్టేషన్ల రైటర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీఆర్‌బీ సీఐ చందర్‌రాథోడ్‌ మాట్లాడుతూ.. విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌ తో ఎలా నమోదు చేయాలో సూచించారు. అలాగే ఏదైనా ఒక నేరం నమోదైన తర్వాత అట్టి నేరానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌, అరెస్ట్‌, రిమాండ్‌, చార్జిషీట్‌లను సీసీటీఎన్‌ఎస్‌లను ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని తెలిపారు. ప్రతి కేసు వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో ఎలా నమోదు చేయాలో జిల్లా ఐటీ కోర్‌ సిబ్బందితో జిల్లా రైటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రతి పోలీస్‌ అధికారికి సీసీటీఎన్‌ఎస్‌లపై అవగాహన కలిగి ఉండాలని, ఆన్‌లైన్‌లో కేసులకు సంబంధించిన ఎలాంటి పెండింగ్‌ లేకుండా చూడాలని అన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకుని తక్కువ సమయంలో సులభ మార్గంలో నేరాలను చేధించాలని తెలిపారు. అదేవిధంగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీ కోర్‌ ఎస్సై ప్రభాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...