ఏషియన్‌ గేమ్స్‌కు గురుకుల విద్యార్థి ఎంపిక


Wed,August 21, 2019 11:52 PM

నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ: నర్సాపూర్‌ గిరిజన గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థి ఏషియన్‌ గేమ్స్‌కు ఎంపికయ్యాడు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుమన్‌ అనే విద్యార్థి హర్యానా రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి 17 వరకు నిర్వహించిన సాఫ్ట్‌బాల్‌ జాతీయ క్రీడల్లో అండర్‌ -17విభాగంలో ట్రైనింగ్‌ పొందాడు. సుమన్‌ సెప్టెంబర్‌ 8 నుంచి 12 వరకు మలేషియాలోని కౌలంపూర్‌లో జరిగే ఏషియన్‌ గేమ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యాడు. దాంతో బుధవారం గురుకులం సంస్థ కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, సెక్రటరీ నవీన్‌ నికోలస్‌, జాయింట్‌ సెక్రటరీ గౌసోద్దీన్‌, గురుకులం స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ రమేశ్‌, మెదక్‌ ఆర్‌సీ సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ తుమికి వెంకటేశ్వర్‌రాజులు విద్యార్థి సుమన్‌ను అభినందించారు. అనంతరం పూలబొకే ఇచ్చి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...