పట్టాపాస్‌బుక్‌ల పంపిణీ


Wed,August 21, 2019 11:51 PM

చిలిపిచెడ్‌: మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన పట్టాపాస్‌బుక్‌లను ఆయా గ్రామాల వీఆర్‌వోలకు తహసీల్దార్‌ అబ్దుల్‌సత్తార్‌ బుధవారం అందజేశారు. పార్ట్‌-బీ సంబంధించిన 99 పాస్‌బుక్‌లను తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌వోలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్‌-బీ భూసమస్యలను పరిష్కరించి రైతులకు పట్టాపాస్‌బుక్‌లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాలకు చెందిన 99 మంది రైతుల సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రుక్మీద్దీన్‌, వీఆర్‌వో ఎల్లయ్య, ఉస్మాన్‌అలీ, వెంకటేశం, రవి, వీఆర్‌ఏలు భూపాల్‌, రమేశ్‌ రైతులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...