రైల్వేస్టేషన్‌కు 100 ఫీట్ల రోడ్డు


Wed,August 14, 2019 12:25 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలో నిర్మాణమవుతున్న రైల్వే స్టేషన్‌కు 100 ఫీట్ల రహదారి నిర్మాణం కోసం 248 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జేసీ నగేశ్, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో రాంబాబులతో కలిసి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 248 సర్వే నంబర్‌లోని రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమని సర్వే చేసి రైల్వే అధికారులకు అప్పగించాలని అధికారులకు సూచించారు. ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఉన్న 100 ఫీట్ల రోడ్డును రైల్వే స్టేషన్ వరకు నిర్మించేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. భూ సర్వే పనుల పరిశీలన అనంతరం కలెక్టర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రహదారి కోసం అధికారులతో కలిసి భూమిని పరిశీలించారు. రైల్వేశాఖ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సుబ్రమణ్యం, డిప్యూటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ప్రసాద్, సెక్షన్ ఇంజినీర్ అశోక్‌శర్మలను రైల్వే నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రైల్వేశాఖకు భూమిని అప్పగిస్తాం: కలెక్టర్ ధర్మారెడ్డి
రైల్వేస్టేషన్ వరకు 100 ఫీట్ల రోడ్డును నిర్మించేందుకు అనువుగా రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని రైల్వేశాఖ నుంచి ప్రతిపాదనలు రాగానే రైల్వేశాఖకు అప్పగిస్తామని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. రెండు, మూడు రోజుల్లో భూ సర్వేను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...