గ్రామాల అభివృద్ధికి కృషి


Wed,August 14, 2019 12:25 AM

మనోహరాబాద్ : తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని పలు గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మనోహరాబాద్ అతిథి గృహంలో జెడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌తో కలిసి తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో నెలకొన్న పలు సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సమస్య తదితర అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. రెండు రోజుల్లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, సర్పంచులు, కాంట్రాక్టర్లను సమన్వయ పరిచి సమస్యలపై చర్చిస్తామన్నారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు రైల్వే పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు చిట్కుల మహిపాల్‌రెడ్డి, నాయకులు బుడ్డ అంజి తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...