గ్రామాలను హరితవనాలుగా తీర్చిదిద్దుదాం


Wed,August 14, 2019 12:25 AM

పాపన్నపేట : గ్రామాలకు హరితవనాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. రోడ్లను శుభ్రం చేసిన అనంతరం స్థానికంగా నిర్మిస్తున్న వైకుంఠధామానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయినా హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలన్నారు. ప్రతి పల్లెను నందనవనంగా తీర్చిదిద్దాలని వెల్లడించారు. ముఖ్యంగా యువత తలుచుకుంటే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామ గ్రామానికి నర్సరీలను ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెలు పచ్చగా ఉంటాయన్నారు. చాలా మంది మొక్కలు తీసుకెళ్లి అక్కడక్కడ పార వేస్తున్నారని, అలా చేయకుండా ప్రతి మొక్కను నాటి పెంచి పెద్ద చేస్తే ఫలితం ఉంటుందన్నారు. వృక్షాల వల్ల వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయన్నారు. గ్రామాల్లో చెట్లు లేనప్పుడు కరువు కాటకాలు ఏర్పడి దుర్భర స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీటిని సింగూర్ ప్రాజెక్టుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, అది పూర్తయితే జిల్లాలో సాగు నీటికి ఇబ్బందులు ఉండవన్నారు. అలాగే ప్రజలంతా తమ ఇండ్లను ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నారో, పరిసరాలను అలాగే ఉంచుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సర్పంచ్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని, ఆయనకు ప్రతి ఒక్కరూ సహకరిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని తీర్చాల్సిదిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. స్థానికంగా వివిధ దవాఖానల్లో సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తప్పకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కల్యాణలక్ష్మి పేదల పాలిట వరం...
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదల పాలిట వరమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గతంలో ఆడపిల్ల పెండ్లి కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడేవారని, ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్న నాటి నుంచి ధీమా ఏర్పడిందన్నారు. లక్షా 116 రూపాలయను అందిస్తూ పేద కుటుంబాలకు పెద్దన్నలా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు సంబంధించిన 48 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుల్లన్నగారి చందన, జెడ్పీటీసీ సభ్యురాలు గడీల షర్మిలా, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా, మండల అధ్యక్షులు తాడెపు సోములు, గడీల శ్రీనివాస్‌రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్, వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఏడుపాయల చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచులు పట్లొళ్ల బాపురెడ్డి, గురుమూర్తిగౌడ్, బోన్ల ప్రమీల, మల్లేశం స్రవంతి శ్రీనివాస్, అనురాధ, ఏడుకొండలు, నాయకులు బైండ్ల సత్యనారాయణ, కిష్టాగౌడ్, ఉస్మాన్, మనోహర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...