19, 20 తేదీల్లో డ్రాయింగ్ అధికారులకు సీపీఎస్‌పై అవగాహన


Wed,August 14, 2019 12:24 AM

మెదక్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని డ్రాయింగ్ అధికారులకు కంట్రీబూటరీ పింఛన్ స్కీమ్ విధానంపై అవగాహన సదస్సును ఈనెల 19, 20వ తేదీల్లో కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా ఖజానా అధికారి రమేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ విధానంలో అవగాహన కల్పించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా శిక్షకులు రానున్నట్లు పేర్కొన్నారు. 19వ తేదీన డీటీవోలతో పాటు మెదక్, తూప్రాన్ డీటీవో పరిధిలోని డీడీవోలకు, 20న నర్సాపూర్, రామాయంపేట పరిధిలోని డీడీవోలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...