వనదుర్గాభవానీ మాతను దర్శించుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే


Wed,August 14, 2019 12:24 AM

పాపన్నపేట : ఏడుపాయల వనదుర్గా భవానీమాతను మంగళవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్‌శంకర్ నాయక్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు ఏడుపాయల సిబ్బంది, పాలకవర్గం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సత్కరించారు. ఎమ్మెల్యే వెంట ఆలేరు సర్పంచ్ శ్రీనివాస్, నెల్లికుదురు జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఏడుపాయల డైరెక్టర్ గౌరిశంకర్, బాగారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్‌గౌడ్‌తో పాటు ఏడుపాయల సిబ్బంది సిద్దిపేట శ్రీనివాస్, సూర్యశ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...