ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య


Wed,August 14, 2019 12:24 AM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : ప్రైవేటు కళాశాలలో కంటే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ఇంటర్మిడియట్ నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. మంగళవారం నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కళాశాల సిబ్బంది కచ్చితంగా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలని సూచించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి తగిన శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అధ్యాపకులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రతి రోజూ స్టడీ అవర్ పెట్టి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...