వర్షపు నీటిని ఒడిసి పట్టాలి


Wed,August 14, 2019 12:24 AM

రామాయంపేట: భూగర్భ జలాలను కాపాడుకోవాలంటే ఇంటింటికీ ఇంకుడు గుంత, వ్యవసాయ బోర్లవద్ద పామ్‌పండ్స్, నీటి రీచార్జి గుంతలను ఏర్పాటు చేసుకోవాలని ట్రైనీ ఐఏఎస్ అధికారి రాజర్షి పేర్కొన్నారు. మంగళవారం నిజాంపేట మండలంలోని రజాక్‌పల్లి, నందగోకుల్, తిప్పనగుల్ల, నందిగామ గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడి వివరాలను సేకరించారు. అనంతరం రాజర్షి మాట్లాడుతూ నిజాంపేట మండల వ్యాప్తంగా వర్షపు నీటిని ఒడిసి పట్టాలని అన్నారు. నీళ్లులేక అడుగంటి పోయిన బోరుబావుల వద్ద నీటి గుంటల ద్వారా రీచార్జి చేసుకోవాలన్నారు. రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కను నాటి వాటి పర్యవేక్షణ బాధ్యతను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ సీతారామారావు, ఏపీడీ ఉమాదేవి, డీఏవో పరశురాం నాయక్, రామాయంపేట ఏడీఏ వసంత సుగుణ, ప్రత్యేక అధికారి ఏసయ్య, నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, జెడ్పీటీసీ పంజ విజయ్‌కుమార్, తహసీల్దార్ జయరాములు, ఏపీవో రాజ్‌కుమార్, శశిరేఖ, మమత, మల్లేశం ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అమరసేనారెడ్డి, బాల్‌రెడ్డి, ధర్మ సునీత నాగరాజు, అనూష, ప్రీతి, సురేశ్, నర్సింహారెడ్డి, చంద్రవదన, లహరి, కర్రయ్య, బాలనర్సమ్మ, సంతోశ్‌గౌడ్, కృష్ణవేణి, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...