మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం చేయూత


Wed,August 14, 2019 12:24 AM

టేక్మాల్: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బొడ్మట్‌పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ కియోష్క్ (చేపల రుచులు కేంద్రం)ను మత్స్యకారుల సహకార సమాఖ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నర్సింహులుతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. జిల్లాకు 11 ఫిష్ ఫుడ్ కియోష్క్‌లు మంజూరు కావడం జరిగిందన్నారు. ఒక్కో యూనిట్‌ను రూ.4లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 90శాతం ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుందని, మిగిలిన 10శాతం మార్జిన్‌మనీ లబ్ధిదారుడు చెల్లిస్తే సరిపోతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు లబ్ధిదారులు 10శాతం చెల్లించడం జరిగిందన్నారు. ఇందులో ముగ్గురు లబ్ధిదారులకు నిధులు మంజూరు కావడంతో యూనిట్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫిష్ ఫుడ్ కియోష్క్‌లో చేపలతో చేసిన వివిధ రకాల వంటకాలను విక్రయించనున్నట్లు తెలిపారు. చేప ఆరోగ్యకరమైన ఆహారమని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు చేపల రవాణ కోసం 24 బొలేరో వాహనాలు, 155 ఆటోలు, 2962 ఎక్సెల్ వాహనాలను 70శాతం సబ్సిడీతో అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై భీంలానాయక్, లబ్ధిదారుడు విఠల్, మత్స్య సంఘం గ్రామ అధ్యక్షుడు సాయిబాబా, మాజీ అధ్యక్షుడు శంకరయ్య, నర్సింహులు, సభ్యులు కిష్టయ్య, వీరయ్య, కుమార్, అశోక్, నాయకులు దశరథ్‌గౌడ్, బస్వరాజ్, విష్ణువర్ధన్‌రెడ్డి, సురేశ్ ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...