అంగన్‌వాడీలో అక్రమాలకు చెక్


Mon,August 12, 2019 11:22 PM-ప్రత్యేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం
-జిల్లాలో మొత్తం 4 ప్రాజెక్టులు
-1076 కేంద్రాలు,54,579 మంది విద్యార్థులు
-అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏఎల్‌ఎంఎస్ కమిటీల ఏర్పాటు
-కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

తూప్రాన్, నమస్తే తెలంగాణ : అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. కేంద్రాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కేంద్రాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం అందుతున్న తీరును మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి ఓ అంగన్‌వాడీ లెవల్ మానిటరింగ్ సపోర్టు అండ్ కమిటీ (ఏఎల్‌ఎంఎస్‌సీ)లను ఏర్పాటు చేసి మరింత బలోపేతం చేయాలని యోచిస్తున్నది. అందుకు ఈ కమిటీలను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంగన్‌వాడీలో జరుగుతున్న అక్రమాలకు నిరోధించడానికి ఈ కమిటీలో ఆ గ్రామ సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తాడు. ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటి కంటే ఎక్కువ అంగన్‌వాడీ కేంద్రాలుంటే మిగిలిన కేంద్రాలకు వార్డు సభ్యుల్లో ఒకరిని చైర్మన్లుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో మొత్తం నాలుగు ప్రాజెక్టులున్నాయి.

వాటిలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, అల్లాదుర్గం ఉన్నాయి. నాలుగు ప్రాజెక్టులల్లో 1076 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వాటిలో పెద్దవి 885 కేంద్రాలుండగా 191 చిన్న కేంద్రాలున్నాయి. 885 పెద్ద కేంద్రాల్లో 868 అంగన్‌వాడీ టీచర్లు పని చేస్తుండగా 191 చిన్న కేంద్రాల్లో 186 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం జిల్లాలో 54,579 మంది విద్యార్థులు అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్నారు. వీరిలో 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు వారు 6762 మంది విద్యార్థులు కాగా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు వాళ్లు 21,787, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు వాళ్లు 26,030 మంది విద్యార్థులు కేంద్రాలకు వస్తున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం 6394 మంది గర్భిణులతో పాటు 6258 మంది బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందుతున్నది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో అవకతవకలకు తావివ్వకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ఏఎల్‌ఎంఎస్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాగా ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేయగా ఈ మధ్య రిక్రూట్‌మెంట్ అయిన కేంద్రాల్లో కొత్త కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని జిల్లా సంక్షేమ అధికారి వెల్లడించారు.

కొత్త కమిటీలో ఎవరెవరు ఉంటారు...
ఏఎంఎల్‌ఎస్ కమిటీలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో మహిళా వార్డుసభ్యులు చైర్మన్లుగా వ్యవహరించేందుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వారితో పాటు గర్భిణి, బాలింత, కిశోర బాలిక, ఆశ కార్యకర్త, మహిళా సైన్స్ ఉపాధ్యాయురాలు వంటి వారిలో ఒక్కొక్కరు చొప్పున సభ్యులుగా ఉంటారు. అంగన్‌వాడీ టీచర్ కమిటీకి కన్వినర్‌గా వ్యవరిస్తారు. వీరంతా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పౌష్టికాహారం పక్కాగా అందే అవకాశం ఉన్నది.

ఏఎల్‌ఎంఎస్ కమిటీ విధి విధానాలు...
ఏఎల్‌ఎంఎస్ కమిటీల ఏర్పాటుతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు తావులేకుండా చూడాలి. అంగన్‌వాడీలకు వచ్చే కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలు వంటి వారు ఎదుర్కొనే సమస్యలను చర్చిస్తూ తగిన చర్యలు తీసుకోవాలి.

జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి..
జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. మెదక్, నర్సాపూర్, రామాయంపేట, అల్లాదుర్గం కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. వీటిలో మొత్తం 54,579 మంది విద్యార్థులు అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసిస్తుండగా 8,12,163 మంది మొత్తం జనాభా ఉన్నది. వారిలో 6394 మంది గర్భిణులు ఉండగా, 6258 మంది బాలింతలు ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించేందుకు అధనంగా కొత్త అంగన్‌వాడీ లెవల్‌మానిటరింగ్ సపోర్టు అండ్ కమిటీ (ఏఎల్‌ఎంఎస్‌సీ)లను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని కేంద్రాలకు కమిటీలు ఏర్పాటు కాగా మిగిలిన వాటికి త్వరలో ఏర్పాటు కానున్నాయి. ఈ కమిటీలతో కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం అర్హులైన వారికి అందించడం జరుగుతుంది.- రసూల్, జిల్లా సంక్షేమ అధికారి మెదక్

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...